‘సైరెన్‌’ టీజర్‌ విడుదల

Nov 18,2023 19:01 #movie

జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సైరెన్‌’. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. దిల్‌ రాజు విడుదల చేసిన ఈ టీజర్‌లో ప్రధానంగా రెండు పాత్రల మధ్య నడిచే కథ చూపించారు. పెరోల్‌పై జయం రవి జైలు నుంచి బయటకు వచ్చే సీన్‌ ద్వారా హీరో క్యారెక్టర్‌ను రివీల్‌ చేశారు. ఖైదీ పాత్రలో జయం రవి నటిస్తుండగా, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హోమ్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సుజాత విజరు కుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా ట్రైలర్‌, ఆడియో, మూవీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని చిత్రబృందం తెలిపింది.

➡️