తక్షణమే బహిర్గతం చేయాలి

Mar 11,2024 15:07 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట ( పశ్చిమగోదావరి జిల్లా) : ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే బహిర్గతం చెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు   కే తా గోపాలన్  డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణ బహిర్గతం చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం  ఆచంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్రాంచ్ వద్ద సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలను కోరుతూ ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు.గత నాలుగేళ్ళలో అమ్మినబాండ్లు,
వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని బహిర్గతం చేయాలన్నారు. ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంక్‌ అందించాలనీ, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్‌బిఐ విఫలమైందని విమర్శించారు. ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్‌బిఐకి ఇచ్చిన మూడు వారాల గడువు ముగిసిందన్నారు.. ఆ వివరాలను వెల్లడిరచడానికి బదులు ఎస్‌బిఐ, గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసంమన్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడిరచకుండా వుండేందుకు పన్నాగం పన్నినట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు.  ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఎల్ల లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు   ఎస్ వి ఎన్ శర్మ, నరసింహమూర్తి, పరువు మోహన్ రావు, వద్దిపర్తి అంజిబాబు, మచ్చ సుబ్బారావు, కుసుమ జయరాజు, నాయకులు తోటపల్లి సత్యనారాయణ, తలుపురి బుల్లబ్బాయి, మానుకొండ రాంబాబు, సిర్రా  విగ్నేశ్వరుడు, అండ్రు సుబ్బారావు, బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.

➡️