ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్‌కూ దిక్కులేదు

shortage of ambulance in up

తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తరలించిన భర్త

లక్నో : గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో మరణించిన తన భార్య మతదేహాన్ని తోపుడు బండిపై మోసుకెళ్తూ కనిపించాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఎటా జిల్లా అస్రౌలి గ్రామానికి చెందిన వేద్‌ రామ్‌ భార్య మోహర్‌కు సోమవారం గుండెపోటు రావడం వల్ల చికిత్స నిమిత్తం ఆమెను ఫిరోజాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడి ట్రామా సెంటర్‌లో ఆమెకు మంగళవారం చికిత్స అందించారు. పరిస్థితి విషమించి వైద్య అందుతుండగానే ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో మహిళ మతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల తర్వాత ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు మతురాలి భర్త, కుటుంబ సభ్యులకు సూచించారు. ఆ మేరకు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల్సిందిగా భర్త ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నారు. ఇందుకోసం చాలా సమయం ఆస్పత్రిలోనే వేచి ఉన్నారు. ఎంతకీ ఎవరూ స్పందించకలేదు. దీంతో చేసేదేమీలేక చనిపోయిన భార్య మతదేహాన్ని, భర్త తన బంధువు సాయంతో అక్కడే ఉన్న ఓ తోపుడు బండిపై వేసుకొని ఇంటి బాట పట్టాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు ఆ అమానవీయ దశ్యాలను ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దష్టికి వెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌ జైన్‌ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే తమ ఊరు పక్క జిల్లాలో ఉందన్న కారణంతోనే అంబులెన్స్‌ నిరాకరించినట్లు మతురాలి భర్త వాపోయారు. ఇతర జిల్లాలకు అంబులెన్స్‌లను పంపలేమని, వాహనం కూడా అందుబాటులో లేదని వైద్యులు చెప్పారని ఆయన బోరున విలపించారు. ఇదేనా బిజెపి చెప్పే ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కార్‌ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

➡️