మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ : వృద్ధుడు సజీవదహనం

కాకినాడ రూరల్‌ : మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వృద్ధుడు సజీవదహనమైన ఘటన మంగళవారం కాకినాడ రూరల్‌ వాకలపూడి ఇండిస్టియల్‌ ఏరియాలో జరిగింది. సంతోషి ఆయిల్‌ కంపెనీ లోకి లోడింగ్‌ కు మినీ వ్యాన్‌ లో సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు (70) బయలుదేరారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. వ్యాన్‌ డోర్‌ తెరుచుకోకపోవడంతో వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలానికి కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి, కాకినాడ రూరల్‌ ఎంఆర్‌ఒ మొరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీ కృష్ణ చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️