గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాత పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు

ప్రకాశం జిల్లా : గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) రాత పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఐపిఎస్‌ స్వయంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పరీక్షకు బందోబస్తు విధులను నియమించారు. పలు సూచనలు చేశారు.

జిల్లాలో గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) రాత పరీక్ష జరుగుతున్న సందర్భముగా … జిల్లా ఎస్పీ ఒంగోలులోని క్విజ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, రైస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఎకెవికె కాలేజీ, నాగార్జున డిగ్రీ కాలేజీ, ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీల పరీక్షా కేంద్రములను స్వయంగా తనిఖీ చేసి, అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి స్మార్ట్‌ వాచ్‌, మొబైల్‌ ఫోన్స్‌, ఐపాడ్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించకూడదని అన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులు గానీ ఉండకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పరీక్ష జరుగుతున్న తీరును పరీక్ష కేంద్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ … జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు చేపట్టామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్‌, ప్రింటింగ్‌ సెంటర్లు మూయించివేశామన్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, ప్రశ్నాపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్‌ చేయడానికి తగిన ఎస్కార్ట్‌ ను నియమించామని, కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్‌ శాఖ తరపు నుండి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌ కు అభ్యర్థులు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ కె.వి.రాఘవేంద్ర, సిబ్బంది ఉన్నారు.

➡️