కార్యదర్శి రాజా సేవలు ప్రశంసనీయం

Mar 21,2024 11:52 #Konaseema

ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : అమలాపురం మండలం కామనగరువు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సేవలందిస్తున్న ఏఎస్ వీఎస్ఎస్ రాజేశ్వరరావు(రాజా) సేవలు ప్రశంసనీయమని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ కొనియాడారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిపారు. సర్పంచ్ తో పాటు పాలకవర్గ సభ్యులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది కార్యదర్శి రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

➡️