ఒపిఒలుగా కార్యదర్శులు!

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు చకచకా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మందికి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వారిని కేవలం ఒపిఒలు (అదర్‌దెన్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌)గా మాత్రమే వినియోగించుకునేరదుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొంత మందికి శిక్షణ కూడా ఇస్తుండడంతోపాటు కార్యదర్శుల సామాజిక గ్రూపుల్లో దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయుల స్థానంలో వలంటీర్లను, కార్యదర్శులను పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ వలంటీర్ల వినియోగంపై ఎన్నికల కమిషన్‌, న్యాయ స్థానాలను అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లపై వెనకడుగు వేయాల్సి వచ్చింది. అయితే కార్యదర్శులు మాత్రం అధికారికంగా ఉద్యోగులుగా ఉండడంతో వారి సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు నిర్ణయించిరది. అయితే పోలిరగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను మాత్రమే వినియోగించుకురటూ గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను సాధారణ విధులకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేవలం ఓటర్ల వేలుపై ఇంకు గుర్తు వేయడం, వారి ఓటర్‌ స్లిప్పులను ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అన్నది చూడడం వంటి అంశాలకు మాత్రమే వారిని పరిమితం చేయనున్నారు.

ఉత్సాహంగా కార్యదర్శులు
ఇప్పుడు కార్యదర్శులుగా నియమితులైన వారికి ఇదే తొలి ఎన్నికల విధులు కావడంతో వారంతా ఉత్సాహంగా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఓటర్లుగానే ఉన్న తమకు ఎన్నికల నిర్వహణ విధుల్లో భాగస్వామ్యులు కావడం కొత్త అనుభూతినిస్తోందని పలువురు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులు చెబుతున్నారు.

➡️