యానాదులకు అందని పథకాలు

Jan 1,2024 00:41

ప్రజాశక్తి – బాపట్ల
గిరిజన యానాదులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోక తరతరాలుగా పొలం గట్లు, చెట్లనీడనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జాతీయ గిరిజన ఫెడరేషన్ కమిటీ అధ్యక్షులు దేవరకొండ రాము ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని 3వ వార్డులో గిరిజన, యానాదుల నివాసాలను ఆయన సందర్శించారు. తరాలు మారుతున్న యానాదుల తలరాతలు మారడం లేదన్నారు. రేషన్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పటికీ కొంతమందికి లేకపోవడం బాధాకరమని అన్నారు. నివేశన స్థలాలు లేక, పొలం గట్లపై గుడిసెలు వేసుకుని నివాసాలు ఉంటున్నారని అన్నారు. వారిని గుర్తించి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. యానాదుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉయ్యాల శివ, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కట్టా కామేశ్వరి, కార్యదర్శి పాలపర్తి నాగరాజు, ఉప కోశాధికారి ఉయ్యాల గురవయ్య, దాసరి లక్ష్మి పాల్గొన్నారు.

➡️