పథకాల పాఠం : గవర్నర్‌ ప్రసంగంపై సిపిఎం

Feb 6,2024 09:34 #cpm, #Governor, #lesson, #Schemes, #speech

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో చేయించిన ప్రసంగంలో ఐదేళ్ల కాలంలో అమలు అమలు చేసిన పథకాల పాఠాన్ని వల్లె వేయించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బటన్‌ నొక్కుడే ప్రభుత్వం సర్వస్వం మాదిరిగా ఏకరువు పెట్టించింది. మొత్తం ప్రసంగమంతా వివిధ పథకాల గురించి, ముఖ్యమంత్రి గొప్పతనం గురించి వివరించడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకున్న పరిస్థితి లేదు. తమ భూములకు హక్కులు లేకుండా పోతున్నాయనే రైతుల ఆందోళనతో పాటు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ సహజ న్యాయసూత్రాలకు సైతం విరుద్ధంగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు అందోళన చేస్తున్న సమయంలో కూడా ఆ చట్టాన్ని గొప్పగాను, రీ సర్వేను చారిత్రాత్మకంగా గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనడం ప్రజల ఆందోళనలు పట్టించుకోని నిరంకుశ మహారాజులను తలపిస్తోంది. గవర్నర్‌ చేత కొన్ని అబద్దాలు చెప్పించడం మరీ దారుణం’ అని పేర్కొంది.

➡️