అవే అవస్థలు

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి

సంతబొమ్మాళి సచివాలయం వద్ద వేచి ఉన్న పింఛనుదారులు

  • పింఛను కోసం గంటల తరబడి పడిగాపులు
  • బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకురావడంలో జాప్యం
  • రాత్రి 9 గంటల వరకూ పంపిణీ
  • రోగులు, నడవలేని వారికీ సచివాలయంలోనే అందజేత

పింఛన్ల పంపిణీలో అధిక చోట్ల లబ్ధిదారు లకు అవే అవస్థలు ఎదురయ్యాయి. గురువారం నాటికి పింఛన్ల పంపిణీ 85 శాతం దాటినా పాట్లు తప్పలేదు. రెండో రోజు చాలాచోట్ల ఆలస్యంగా పింఛన్లను పంపిణీ చేశారు. రాత్రి తొమ్మిది గంటల వరకు పంపిణీ కొనసాగింది. నీడ, వసతి కల్పించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించినా కిందిస్థాయి సిబ్బంది చాలా సచివాలయాల్లో వాటిని ఏర్పాటు చేయలేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డబ్బులు అందుతాయో లేదోనన్న ఆందోళనతో లబ్ధిదారులు ఎగబడటంతో కొన్నిచోట్ల గందరగోళం చోటు చేసుక ుంది. మరోవైపు రోగులు, నడవలేని వారికి ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వాలని నిబంధన ఉన్నా చాలాచోట్ల సచి వాలయా ల్లోనే అందించారు.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,689 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. గురువారం నాటికి 2,77,353 (86.22శాతం) అందించారు. ఇంకా 44,336 మందికి పింఛన్‌ డబ్బులను అందించాల్సి ఉంది. కోటబొమ్మాళి సంతబొమ్మాళి (81.40 శాతం), లావేరు (81.56 శాతం), కోటబొమ్మాళి (81.59 శాతం), ఎల్‌ఎన్‌పేట (82.57 శాతం), గార (83.02 శాతం), సోంపేట (83.76 శాతం), తదితర మండలాలు పంపిణీలో అట్టడుగున ఉన్నాయి. కోటబొమ్మాళి మండలంలో చాలా సచివాయల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పింఛన్లు అందించారు. ఉదయం ఏడు గంటలకే పింఛన్లు పంపిణీ జరుగుతుందనే సమాచారంతో లబ్ధిదారులు ఆ సమయానికే చేరుకున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, వారిని ఇళ్లకు పంపేశారు. కొంత మంది ఇళ్లకు వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. బ్యాంకుల వద్ద జాప్యంతో ఇబ్బందులుటెక్కలి ఐదో సచివాలయం ఉదయం ఏడు గంటలకే లబ్ధిదారులు సచివాలయానికి వచ్చారు. సిబ్బంది పదిన్నర గంటల తర్వాత డబ్బుల పంపిణీ చేపట్టారు. సచివాలయానికి ఈ నెల మూడో తేదీన పూర్తిస్థాయిలో డబ్బులు రాకపోవడంతో కొంత మందికే ఇచ్చారు. గురువారమూ అదే పరిస్థితి రావొచ్చనే అందోళనతో డబ్బులు కోసం ఒకరినొకరు నెట్టుకున్నారు. సంతబొమ్మాళి మండలంలో బ్యాంకుల నుంచి నగదు తీసుకురావడంలో ఆలస్యం కావడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి 16 సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ మొదలు పెట్టారు. పింఛను కోసం వచ్చిన లబ్ధిదారులు సచివాలయాల్లోనే పడిగాపులు కాశారు. పడిగాపులు పింఛను పంపిణీ జాప్యం జరిగింది. దీంతో పింఛనుదారులు నాలుగు రోజుల నుంచి కోసం ఎదురు చూసినా వారికి నిరాశే పడ్డారు. పింఛనుకోసం పలు సచివాలయాలు వద్ద పడి గాపులు కాచుకొని కూర్చున్నారు. సచివాలయానికి రాలేక ఇబ్బందులు పడ్డ వృద్ధులుఆమదాలవలస మండలంలో చాలాచోట్ల మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఫించన్ల పంపిణీ ప్రారంభమైంది. పంపిణీలో వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులు, దీర్ఘకాలిక రోగులు, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛను అందించాలని అధికారులు ఆదేశించినా అవి క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. దీంతో వికలాంగులు, నడవలేని వృద్ధులు, రోగులు వారి బంధువులు, తెలిసిన వారి సాయంతో ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో సచివాలయాలకు చేరుకున్నారు. సరుబుజ్జిలి మండలంలో పింఛన్ల పంపిణీ ఆలస్యంగా చేపట్టడం, తాగునీరు, నీడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎండ వేడిమితో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.

➡️