ప్రతి నెల 1న జీతాలు చెల్లించాలి

Jan 19,2024 23:43

ప్రజాశక్తి – బాపట్ల
ప్రతి నెల 1న ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని కోరుతూ స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ధర్నా చేశారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె వినయ్ కుమార్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరెండర్ సెలవులు, ఎపీ జిఎల్ఐ రుణాలు, ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుండి మినహాయించి దాచుకున్న సొమ్మును ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, కోశాధికారి ఎం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి వాసి చక్రధర్, ప్రధాన కార్యదర్శి దొంతిబోయి నన్నురయ్య, ఎంఎఎస్ ప్రసాద్ బాబు, బివి శ్రీనివాసరావు, వైవి నారాయణ, నూతలపాటి కోటేశ్వరరావు, వై భాస్కరరావు పాల్గొన్నారు.

➡️