ఎస్మా రద్దు.. జీతాల పెంపు.. : రౌండ్‌టేబుల్‌ తీర్మానం

round table meetign on esma on anganwadi workers strike
ప్రజాశక్తి-విజయవాడ :  కార్మిక, ఉద్యోగ సమ్మెలకు మద్దతుగా విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్మా రద్దు చేయాలని, అంగన్‌వాడీ, మున్సిపల్‌, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం చేసింది. కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే సమ్మెలను విరమింపజేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బట్టి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని రౌండ్‌టేబుల్‌ సమావేశం తెలిపింది. సమ్మెను పరిష్కరించకపోతే అవసరమైతే రాష్ట్ర బంద్‌కు కూడా వెళ్తామని హెచ్చరించారు. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జైభారత్‌ నేషనల్‌ పార్టీ వివి లక్ష్మిణారాయణ, సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మరియు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
➡️