వైఎస్ఆర్సిపి నేతకు నివాళులర్పించిన మంత్రి రోజా

Nov 25,2023 16:07 #Tirupati district
roja condolence ycp leade death

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక గేటు పుత్తూరు ఎనిమిదవ వార్డుకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు దేవరాజులు మొదలియార్‌ అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యటక సాంస్కృతిక వ్యవహారాలు యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కె రోజా మున్సిపాలిటీ పుత్తూరు నందు నివాసం ఉంటున్న పుత్తూరు మొదలియార్ మక్కల్ నాలసంఘం అధ్యక్షుడు మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు దేవరాజ్ మొదలియర్ ఆకస్మిక మరణించడంతో ఇంటివద్ద భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి. కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి శంకర్. పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.‌

➡️