పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలి : యుటిఎఫ్

Feb 4,2024 17:02 #ops, #utf
  • ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్ ఆవిష్కరించిన యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు 

ప్రజాశక్తి-కాకినాడ : ఓట్ ఫర్ ఓపిఎస్ అంటూ పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలని ఆకాంక్షిస్తూ ఆదివారం కాకినాడ జిల్లా యుటిఎఫ్ హోం లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అధికారం చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. జిపిఎస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓపిఎస్ సాధనే ఎజెండా చేయాలని అన్ని రాజకీయ పక్షాల నాయకులను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కలుస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నిటినీ సంఘటిత పరచి ఓపిఎస్ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి టి. అన్నారాం, జిల్లా అధ్యక్షుడు కెవివి నగేష్, ప్రధాన కార్యదర్శి టి. రవి చక్రవర్తి, జిల్లా కార్యదర్శి టి. సీతారామయ్య, కుటుంబ సంక్షేమ పథకం కార్యదర్శి ఎన్‌. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

➡️