ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఇలాగేనా ? : మణిపూర్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : హింసాకాండలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల పునరుద్ధరణలో మణిపూర్‌ ప్రభుత్వ అలసత్వంపై సుప్రీం సీరియస్‌ అయింది. వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకున్నారో జస్టిస్‌ గీతా మిట్టల్‌ కమిటీ ముందు చెప్పాలని ఆదేశించింది. ఘర్షణల సమయంలో నాశనమైన లేదా ధ్వంసమైన ప్రార్థనా స్థలాలను గుర్తించామని చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌కు ప్రభుత్వం తెలిపింది. మతంతో సంబంధం లేకుండా దెబ్బతిన్న అన్ని ప్రార్థనా స్థలాల వివరాలను రెండు వారాల్లో కమిటీకి అందజేయాలని బెంచ్‌ ప్రభుత్వాన్ని శుక్రవారం కోరింది. మెయితి క్రిస్టియన్‌ చర్చిల కౌన్సిల్‌ తరపున హఫీజా అమ్మది మాట్లాడుతూ, క్రిస్మస్‌కు క్రైస్తవులందరూ చర్చిల వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మణిపూర్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించాలని కోరారు. రిలీఫ్‌ కేంప్‌ల్లో వుండే వారు క్రిస్మస్‌ సంబరాల్లో పాల్గొనేలా చూస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యాభాటి కోర్టుకు హామీ ఇచ్చారు.

➡️