సమస్యలు పరిష్కరించాలని శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ వాసుల ధర్నా

Jan 30,2024 16:13 #Dharna, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఆఫీసుట్టు తిరిగి తిరిగి అలిసిపోయాం పాములు, దోమల భారీ నుండి రక్షించాలంటూ పెద్దపాడు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ ప్రజలు మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మా కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఎస్‌.ఎల్‌.వి కాలనీ ప్రజలకు మద్దతుగా పాల్గొన్న పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వీధిలో కొంతమందికి మాత్రమే నీళ్లు వస్తున్నాయి ఉన్న లైట్లు వెలగవు, రోడ్లు కాలువల లాంటి అభివద్ధి పనులు ఏ ఒక్కటి చేపట్టలేదు.ఒక బాలిక పాముకాటు గురైందని అధికారుల దృష్టికి తెచ్చినా… ఇంతవరకు వీధిలైట్ల సమస్యపై సంబంధిత అధికారులు స్పందించలేదని విమర్శించారు. శ్రీ లక్ష్మీ విలాస్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఎన్‌. రామన్న, ఎస్‌ఎండి షరీఫ్‌, జి.టి.నారాయణ, శ్యామల మాట్లాడుతూ.. అందరితోపాటు మేము..ఇంటి పన్నులు చెల్లిస్తున్నాం.. కానీ మా కాలనీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.అభివద్ధి పనులు చేపట్టి పాములు, దోమల నుండి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌ మాట్లాడుతూ.. కమిషనర్‌తో చర్చించి కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాకు పిపిఎస్‌ఎస్‌ నగర నాయకులు ఏ. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో కాలనీ ప్రజలతో పాటు పి.పి.ఎస్‌.ఎస్‌ నగర నాయకులు సి.వి .వర్మ, ఎస్‌.రమణ గౌడ్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

➡️