1న పల్లెగూటికి పండగొచ్చింది విడుదల

Nov 29,2023 19:20 #movie, #suman

కె.ప్రవీణ్‌ సమర్పణలో ఈశ్వర్‌ మెమోరియల్‌ లక్ష్మి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం ‘పల్లె గూటికి పండగొచ్చింది’. రోహిత్‌కృష్ణ, సంతోష్‌, నిఖిత, హర్షిత హీరో హీరోయిన్లుగా నటించారు. కంచరాన రాజ్యలక్ష్మి నిర్మాత. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కంచరాన తిరుమలరావు. సంగీతం సింధు కె.ప్రసాద్‌. డిపిఒ రవి కె మోహన్‌, ఎడిటర్‌ రాఘవేంద్రరెడ్డి పి. వ్యవహరించారు. ఈ సినిమా డిసెంబర్‌ ఒకటోతేదీన విడుదల కానుంది. హేమంత్‌ గుజ్జూరు, సుమన్‌, సాయికుమార్‌, శాయాజీ షిండే, రఘుబాబు, అన్నపూర్ణ, జబర్దస్త్‌ రాజమౌళి, అప్పారావు, రఘు, గుండు మురళి, జగదీశ్వరి తదితరులు నటించారు.

➡️