వాలంటీర్లకు బలరాంచే నియామక పత్రాలు

Dec 14,2023 00:33

ప్రజాశక్తి – చీరాల
వాలెంటీర్లు అందరూ బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలో ఖాళీగా ఉన్న ఆరు వాలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద వారికీ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండలం అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, పృద్వి ధనుంజయ, బుర్ల మురళీకృష్ణ, చిన్ని లీలాధర్, గుర్రం బుజ్జి, పర్వతనేని శ్రీనివాసరావు, గవిని నారాయణ పాల్గొన్నారు.

➡️