పట్టాలివ్వాలి… రిజిస్ట్రేషన్లు చేయాలి

Apr 8,2024 16:02 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు : జాకీర్ హుస్సేన్ నగర్ లో ప్రతి ఇంటికి పట్టాలు ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. బీడీ & సిగార్ కార్మికులకు సంక్షేమం చట్టం చేయాలని,  కనీస వేతనం అమలు చేయాలని తెలిపారు. జాకీర్ హుస్సేన్ నగర్ లో కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించాలని, వాటర్ ట్యాంకుకు మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. సిఏఏ లాంటి చట్టాలు బీజేపీ చేయడం వల్ల మైనారిటీలు అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి – టిడిపిలు వంతపడుతున్నాయని తెలిపారు. స్వార్థపూరిత పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో సిపిఎంను గెలిపించాలని కోరారు. సోమవారం 4 మరియు 5వ డివిజన్ ల పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్ లో సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేశారు.

➡️