ఇప్పుడే కోలుకుంటున్నాను : గాయంపై హీరో సూర్య పోస్ట్‌

Nov 24,2023 12:36 #hero surya, #injured, #post

హైదరాబాద్‌ : ” ఇప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉంది ” అంటూ … నటుడు సూర్య తాజాగా పోస్ట్‌ పెట్టారు. శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువా’ షూటింగ్‌లో హీరో సూర్య గాయపడిన సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ సమయంలో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయన భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలి చికిత్స అందించారు. తనకు అయిన గాయం గురించి హీరో సూర్య తాజాగా స్పందించారు. ” నాకు గాయమైందని తెలిసి ఎంతో మంది మెసేజ్‌లు పంపుతున్నారు. మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉంది ” అంటూ పోస్ట్‌ పెట్టారు. దీంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంగువా చిత్రం రిలీజ్‌కు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. ఏకంగా 38 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

➡️