రికార్డులను సక్రమంగా వుంచాలి

Feb 8,2024 00:33

ప్రజాశక్తి – పర్చూరు
ఆహార తనిఖీ అధికారి ప్రణీత్ శీతల పానీయాల గోడౌన్‌లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార లావాదేవీలు, తిను బండారాల వివరాలు నమోదు సక్రమంగా ఉన్నట్లయితేనే మంచి ఆహారాన్ని గడువు తీరక ముందే ప్రజలకు అందించ గలుగుతామని వివరించారు. గడువు తీరిన పదార్థాలు అమ్మడం నేరమని అన్నారు. అవి విస్మరిస్తే వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. స్థానిక చీరాల రహదారిలోని శీతల పానీయాల గోడౌన్‌ను పదిశీలించి రికార్డులు సక్రమంగా లేని కారణంగా నోటీసు ఇచ్చారు. ఆయన రాకతో పర్చూరులోని హోటళ్ళు అయన వెళ్ళే వరకూ మూత వేశారు.

➡️