‘రాక్షస రాజా’గా రానా

Dec 14,2023 13:25 #Hero Rana, #movie

హైదరాబాద్‌ : ప్రముఖ హీరో రాణా ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత రానా పలు సినిమాల్లో నటించినా.. అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని రానా  చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తేజ దర్శకత్వంలో చిత్రానికి కమిట్‌ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 14 రాణా పుట్టనరోజు సందర్భంగా తేజ, రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాక్షస రాజా’ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో రానా గన్‌ పట్టుకుని వైల్డ్‌ లుక్‌లో కనిపించారు. ఫుల్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్నట్లు ఈ పోస్టర్‌ని చూస్తేనే అర్థమవుతుంది. త్వరలోనే హీరోయిన్‌ ఎవరనేది చిత్రయూనిట్‌ ప్రకటించనుంది. కాగా, రానా, తేజ కాంబినేషన్‌లో ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ సూపర్‌డూపర్‌ హిట్‌కొట్టింది. మళ్లీ చాలారోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘రాక్షసరాజా’ మూవీ తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

➡️