ప్రపంచ గ్లోకోమా వారోత్సవాల ర్యాలీ

Mar 15,2024 16:11 #East Godavari

ప్రజాశక్తి-చాగల్లు(తూగో) : ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా చాగల్లు లో శుక్రవారం ఇందిరమ్మ కాలనీలో ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా డాక్టర్ తాడికొండ మనోజ్ కుమార్ గ్లోకోమా గురించి వివరించారు. క్లకోమావ్యాధి కంటి లోపల పీడనం పెరిగి కంటి నరాలు చచ్చిబడి పోయేలా చేస్తుందని అన్నారు. ఫలితంగా నెమ్మదిగా కంటిచూపు తగ్గిపోతుందని తెలియజేశారు. గ్లోకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనబడవని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే కంటిచూపులు కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. వెలుతురు చుట్టూ రంగుల వలయం కనబడటం తరచూ తలనొప్పితో పాటు కళ్ళు ఎర్రబడటం వాంతులు కనుగుడ్లు నొప్పిగా ఉండటం గ్లోకోమా లక్షణాలని వివరించారు. తరచుగా గ్లోకోమో పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు అని తెలియజేశారు. 35 నుండి 40 సంవత్సరాలు వయసున్న వారు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు స్టెరాయిడ్స్ మందులు అధికంగా వాడేవారు కుటుంబంలో ఎవరైనా గ్లోకోమాతో బాధపడుతున్న వారు గ్లోకోమా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పెంటపాటి గురుస్వామి స్టాఫ్ నర్స్ ప్రదీప హెల్త్ సూపర్వైజర్లు రమణమూర్తి ఎన్ ఎల్ కె ప్రభావతి ఎం ఎల్ హెచ్ పి లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️