రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషనల్లో వస్తున్న 171వ చిత్రం గురించి తాజా అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్‌ని 25 ఏళ్ల కుర్రాడిగా చూపిస్తున్నారని తెలుస్తోంది. అందుకోసం డీఏజినింగ్ అనే టెక్నాలజీని విని యోగిస్తున్నారని సమాచారం. ‘కబాలి’.. ‘కాలా’… ‘రోబో’ చిత్రాల్లో రజనీ కాంత్‌ని వయసు తగ్గించి చూపించారు. అయితే చాలా కాలంగా రజనీకాంత్‌ని వయసు మళ్లిన పాత్రల్లోనే కనిపిస్తున్నారు. మేకర్స్ కూడా ఆయన వయసును దృష్టిలో పెట్టుకునే స్టోరీలు రాస్తున్నారు. లోకేష్ మాత్రం తన కథ కోసం అదే రజనీని యువకుడిగానే మార్చేస్తున్నాడని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.