అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

Nov 23,2023 15:22 #andhrapradesh, #weather report

అమరావతి: ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో నవంబర్‌ 26 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నవంబర్‌ 27వ నాటికి ఆగేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రం మీద వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ , యానాం లో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తాయని.. రాబోవు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..’ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ , యానాంలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది’ అని వాతావరణ శాఖ తెలిపింది.ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ విషానికి వస్తే గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. మరోవైపు.. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఇక, రేపు , ఎల్లుండి అయితే, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

➡️