తపాలా పథకాలపై ప్రాజెక్టు

Dec 12,2023 10:39 #Jeevana Stories

హాయ్ ఫ్రెండ్స్‌, మా స్కూల్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మా ఊరి హెడ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఎం.నరసింహారెడ్డి మాట్లాడారు. ఆయన మాకు కొన్ని కరపత్రాలను ఇచ్చారు. వాటిని చదివి దానిపై ప్రాజెక్టుని చేశాం.తపాల శాఖ మనకు ఎన్నో విధాలుగా సహాయపడుతుందని ఈ ప్రాజెక్టు ద్వారా నేను తెలుసుకున్నాను. దీనికిముందు తపాలా శాఖ ఉత్తరాలు పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకునేదానిని. ఎన్నో పథకాల ద్వారా ప్రజా సేవ చేస్తోందని ఇప్పుడు అర్థమైంది. ఆధార్‌ మినీ ఎటిఎం తపాలా శాఖ నిర్వమిస్తోంది. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. సంవత్సరానికి కొంత డబ్బు కడితే, కొన్నాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన వల్ల ఆడపిల్లలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ూూఖీ పథకం పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇలా భారత ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా ప్రవేశపెట్టిన పథకాలను అందరూ సద్వినియోగపరుచుకోవాలి. – ఆర్‌. జశ్విత, 8వ తరగతి,అరవింద మోడల్‌ స్కూలు,మంగళగిరి.

➡️