ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహ ధ్వంసం..

Jan 16,2024 18:00 #minister ktr

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్‌ చేశారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్‌ కాలనీలో పోలీసుల ముందే ఓ దుండగుడు.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

➡️