పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం

Feb 8,2024 15:52 #Ch Baburao, #ntr district
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌ బాబురావు

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చునని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌ బాబురావు తెలిపారు. గురువారం 62. డివిజన్‌ కొత్త రాజీవ్‌ నగర్‌లో బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్‌ నగర్‌, హుడా కాలనీ, ప్రకాష్‌ నగర్‌ ప్రాంతాలలో మంచినీళ్లు నెలల తరబడి రాకపోవడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తాగటానికి మంచినీళ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. వైసిపి కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో.. సిపిఎం అనేక రూపాలలో పోరాటాలు చేసిన ఫలితంగా రెండు పూటలా మంచినీళ్లు శాశ్వతంగా రాజీవ్‌ నగర్‌, హుడా కాలనీలో బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుతం వై.సీ.పీ ప్రభుత్వాలు అద్దె దారులందరికి ఇల్లు ఇస్తామని చెప్పి ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు కేటాయించలేదని గతంలో ప్రభుత్వం టిడ్‌ కోఇళ్ల పేరిట మోసం చేసిన విధంగానే జగనన్న ఇళ్ల పేరిట వైసీపీ ప్రభుత్వం ఇల్లు చూపించకుండానే బ్యాంకు లోన్లు రిజిస్ట్రేషన్లు చేస్తామని నాలుగున్నర సంవత్సరాలుగా మోసం చేస్తున్నారని నిజంగా తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలకు ఇల్లు కేటాయించాలని చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇల్లు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మోసగించకుండా ఎన్నికల షెడ్యూల్‌ రాకుండానే ఇల్లు కేటాయించాలని లేనిపక్షంలో సి.పి.ఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం పార్టీ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె. దుర్గారావు, 62, 63 డివిజన్ల సి.పి.ఎం పార్టీ నాయకులు బొంగు రాంబాబు, ఎన్‌. నాగేశ్వరరావు, పి. సాంబిరెడ్డి, బొంగు అమ్ములు, ఎ. నాగబ్రహ్మం షేక్‌ మునాఫ్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️