అయోధ్యపై స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని

Jan 19,2024 11:19 #PM Modi, #stamp

న్యూఢిల్లీ :   అయోధ్యలోని రామాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం స్మారక స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు జారీ చేసిన స్టాంపుల పుస్తకాన్ని రాముడికి అంకితం చేశారు. స్టాంపుల డిజైన్లలో రామాలయం, ‘మంగళ్‌ భవన్‌ అమంగళ్‌ హరి’ అని రాసిన వాక్యాలు, సూర్యుడు, సరయూ నది, ఆలయంలో, చుట్టుపక్కల గల శిల్పాలు వున్నాయి. గురువారం విడుదల చేసిన ఆరు స్టాంపుల్లో అయోధ్యలోని రామాలయం, వినాయకుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్‌రాజ్‌, మా శబరిలు వున్నాయి. ఇవన్నీ రాముడితో ముడిపడినవే. వీటిల్లోని ఐదు భౌతికాంశాలు పంచభూతాలైన ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమిలకు ప్రతీకగా వున్నాయి. వివిధ సమాజాల్లో శ్రీరాముడి పట్ల ఆకర్షణను ప్రదర్శించే ప్రయత్నంగా ఈ స్టాంపులపై పుస్తకాన్ని తీసుకువచ్చారు. 48పేజీల ఈ పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, కెనడా, కంబోడియా, నేపాల్‌, శ్రీలంక, థాయిలాండ్‌లతో సహా 20 దేశాలు, కొన్ని ఐక్యరాజ్య సమితి సంస్థలు జారీ చేసిన స్టాంపులు వున్నాయి.

➡️