రాజకీయంగా ఎదుర్కొలేకే దాడులు

Feb 3,2024 23:52

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
ప్రశాంతంగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో అలజడి సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని టిడిపి బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు తొండెపు ఆదినారాయణ హెచ్చరించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు కామినేని జనార్ధన్, టిడిపి మైనార్టీ సెల్ కార్యదర్శి రజాక్, వైస్ ఎంపీపీ దాసం అశోక్, శివ మాట్లాడారు. గ్రానైట్ పరిశ్రమలపై వైసీపీ రౌడీ మూకలతో మైనింగ్ అధికారులు దాడులు చేసి అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై రాజకీయంగా గెలవలేమనే భయంతో వైసిపి ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ రౌడీ రాజకీయానికి తెర తీసాడని ఆరోపించారు. సంబంధంలేని విషయంలో కేసులు పెట్టి ఎంఎల్‌ఎను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని అన్నారు. ఆమంచికి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఏలూరి కష్టపడి ఉద్యోగం చేసి తన తెలివితేటలతో కంపెనీ ప్రారంభించి రైతన్నలకు సేవలు అందిస్తూ ప్రజల ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. కానీ ఆమంచి తన స్థాయిని, తాను చేసిన వ్యాపారాలను మరచి ఎమ్మెల్యే ఏలూరిపై ఆరోపణలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. బొగ్గు వ్యాపారం చేసి అక్రమాలకు పాల్పడి, జడ్పిటిసిగా, ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇన్చార్జిగా వచ్చి ఇసుక మైనింగ్ మాఫియాకు పాల్పడుతుంది నిజం కాదాని ప్రశ్నించారు. సమావేశంలో టిడిపి నాయకులు మిన్నకంటి రవి, అడుసుమల్లి శ్రీనివాసరావు, మక్కెన శేఖర్ బాబు, మస్తాన్ వలి, మహిళా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు.


కారంచేడు : మాజీ ఎఎంసి చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి మాట్లాడుతూ వైసిపి ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, గుండాయిజం, అక్రమ దందాలు పెరిగాయని అన్నారు. మార్టూరులో గ్రానైట్ పరిశ్రమల, టిడిపి సానుభూతిపరుల మీద అక్రమ కేసులు బనయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని ప్రజా క్షేత్రంలో ఎదుర్కోలేకే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా న్యాయం గెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు కంభంపాటి నరేంద్ర, వార్డు మెంబర్ పాతూరి ఆదిలక్ష్మి, పాతూరి శివరాం, బోయిన శీను, విలేకరి శీను, ఆంజనేయులు, గద్య సుబ్బయ్య, కొల్లా భాస్కరరావు పాల్గొన్నారు.

➡️