సామర్లకోటలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాల కవాతు

Mar 5,2024 15:22 #Kakinada, #police, #raly

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పెద్దాపురం డి.ఎస్.పి కే. లతా కుమారి పేర్కొన్నారు. .కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం సామర్లకోట పట్టణ పరిధి బ్రౌన్ పేట, సీతారామ కాలనీ, సామర్లకోట మెయిన్ రోడ్డులో, స్టేషన్ సెంటర్, మఠం సెంటర్ , ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ దళాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభొమ్మ సెంటర్లో డిఎస్పి లతా కుమారి ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డి.ఎస్పీ ఈశ్వర్ యశ్వంత్,సామర్లకోట సి.ఐ డి. సురేష్,ఎస్ఐ.లు మూర్తి,మౌనిక తదితర సుమారు 100 మంది సి ఆర్ పీ ఎఫ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

➡️