కాదేది ప్రచారానికి అనర్హం…!

May 2,2024 22:22
మారిన మార్కె టింగ్‌

ప్రజాశక్తి – సామర్లకోట

మారిన మార్కె టింగ్‌ పరిస్థితుల్లో హ్యాండ్‌ మైక్‌ అందుబాటులోకి రావడంతో కూరగాయలు, పచ్చళ్ళు, ఆకు కూరలు, పండ్లు, బట్టలు, మామిడి తాండ్ర, కొబ్బరి బొం డాలు, ఐస్‌ క్రీములు, పలు రకాల వస్తువులు విక్రయిం చుటకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాలు ఈ ఎన్నికల్లో రూటు మారి ఓటర్లను ఓట్లు అభ్యర్థించే ప్రచార వాహనాలుగా మార్పు చెందాయి. ప్రచా రానికి కాదేది అనర్హం అంటూ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ప్రచార వాహనాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇంతవరకు ఆటోలు, వ్యాన్‌లు, ఎక్సీడ్‌ బస్సులను మాత్రమే ఎన్నికల ప్రచారాలకు ఉపయోగిస్తూ వచ్చిన నేతలు ఈసారి ఎన్నికల్లో బైక్‌ లను సయితం ప్రచార వాహనాలుగా ఉపయోగిస్తుండటంతో అవి ఈ తరహా ప్రచారం ప్రజలను ఆకట్టు కుంటోంది. నామినేషన్‌ల సమయంలోనో, ప్రదర్శనలకో మోటారు సైకిళ్లను ఉపయో గిస్తూ రాగా ప్రస్తుతం ఎదుటి భాగం మినహా అన్నివైపులా అభ్యర్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చిన మైక్‌ సెట్‌ బిగించి అతి సులువుగా ప్రచార వాహనాల్లా బైక్‌లను మార్చి వేశారు. ఇలా ప్రచారనికి ఒక్కో బైక్‌కు రోజుకు సరిపడా పెట్రోల్‌ పోయించి రూ. 800 నుంచి రూ. వెయ్యి వరకూ చెల్ల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తరహా ప్రచార వాహనాలు పెద్దాపురం నియోజక వర్గ పరిధిలో అధికంగా కనిపిస్తు న్నాయి. ఆటోలు, వ్యాన్‌లు సయితం వెళ్లలేని సందుల్లో కూడా ఈ వాహనాలు వెళ్లి అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు చేపట్టెండుందుకు అనువుగా ఉన్నందున ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో బైక్‌ ప్రచార వాహనాలు ప్రత్యేకతను సంతరించు కున్నాయి.

➡️