నోటి శుభ్రత ఆరోగ్యానికి భద్రత : డాక్టర్ రమేష్ రెడ్డి

Mar 21,2024 16:59 #Pileru

ప్రజాశక్తి-పీలేరు: దంత రక్షణ, నోటి శుభ్రతతో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని తలుపుల పిహెచ్ సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. గురువారం పీలేరు మండలం, తలుపుల ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దంత రక్షణ, నోటి శుభ్రత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ రోజుకి రెండు సార్లు పళ్ళు తోమాలని, ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలని, అవసరమైనప్పుడు తక్షణం డాక్టరును సంప్రదించాలని అన్నారు. నోరు, దంతాలు, చిగుళ్లు, దంతక్షయ, చిగుళ్ళవాపు మొదలగు సమస్యలే కాకుండా నివారణ లేని కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మంచి ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలితో దంత, నోటి ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చని డాక్టర్ వివరించారు. అనంతరం పిల్లలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, ఉపాధ్యాయులు సిద్ధరాజ, నజీర్, ఏఎన్ఎం నాగవేణి, సిహెచ్ఓ కుముద, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️