‘పెద్ద సినిమాల్లో అవకాశాలు రావట్లేదు

Jan 3,2024 19:10 #manisarma, #movie

‘తనకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదని సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. ప్రస్తుతం ఇస్మార్ట్‌ శంకర్‌-2కి సంగీతం అందిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మహేశ్‌, పవన్‌ కల్యాణ్‌ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్‌ ఇవ్వొచ్చు. అలా అన్ని నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్‌ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవీకి ఓ సినిమా.. నాకో సినిమా.. తమన్‌కి ఓ సినిమా. పోనీ వాళ్లకు రెండు ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి. అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. నేను వెళ్లి వాళ్లతో చెప్పలేదు. ఎవరితో చెప్పలేను’ అని మణిశర్మ తన మనసులోని బాధని బయటపెట్టారు. 1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్‌లో ఉన్న మణిశర్మ.. ఆ తర్వాత పాటల పరంగా వెనకబడిపోయారు.

➡️