ఎపిలో నేటి నుంచి ఒంటిపూట బడులు

Mar 18,2024 09:15 #AP, #from today, #One day classes

అమరావతి : ఎపిలో నేటి నుంచి ఒంటిపూటబడులు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణతో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో …. ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగింపు రోజు వరకు ఇదే తరహాలో కొనసాగించాలని నిర్దేశించారు.

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు జరిగే ఏడు రోజుల పాటు 1 నుంచి 9 తరగతలు విద్యార్ధులకు మధ్నాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒంటి పూట బడులు నిర్వహించాలని తాజాగా అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందచేస్తున్నారు. భోజనం చేసిన తరువాత విద్యార్ధులను వారి ఇళ్లకు పంపిస్తారు. ఒంటిపూట బడుల సమయంలోనూ నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేశారు.

➡️