వాషింగ్టన్‌లో కాల్పులు..  ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

Apr 11,2024 23:51 #gun fire, #one died

వాషింగ్టన్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి ముగింపు కనిపించడం లేదు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాషింగ్టన్‌లోని కార్వెర్‌ లాగ్‌స్టన్‌ వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ దారుణం జరిగింది. వాహనంలో వచ్చిన సాయుధుడు అక్కడ వీధిలో ఉన్న ప్రజలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడని మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ పమేలా స్మిత్‌ తెలిపారు.

➡️