మిమ్స్ ఉద్యోగులకు మద్దతుగా 19న రాస్తారోకో

Feb 14,2024 16:59 #Health workers, #Vizianagaram
On 19th, call for Rastarokko across the district

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగులు న్యాయమైన పోరాటం వెనుక తాము ఉన్నామని, న్యాయం జరిగే వరకు పోరాటానికి అండగా ఉంటామని, మిమ్స్ ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా 19 జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. బుధవారం స్థానిక ఎన్ పి అర్ భవనంలో సీఐటియు నగర కార్యదర్శి బి రమణ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు నాయకులు, కార్మిక సంఘాలు నాయకులు పాల్గొని మాట్లాడారు. ముందుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగులకు సంఘం లేకుండా చేసి గత మూడు ఏళ్లుగా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా నిరంకుశంగా చూసిందన్నారు.ఉద్యోగులలో వెట్టి చాకిరి చేయించుకొని శ్రమ దోచుకున్నారని అన్నారు. ఏడు డి.ఏలు ఇవ్వకుండా ఉద్యోగులను అన్యాయం చేసిందన్నారు. అడిగిన ఉద్యోగులను సస్పెండ్ చేయడం, బెదిరించడం వంటి చర్యలు కు యాజమాన్యం పాల్పడుతుందని అన్నారు. గత కొద్ది రోజులుగా మిమ్స్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని మిమ్స్ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. ఈసమస్యలను పరిష్కారం చేయమని అడుగుదామంటే మిమ్స్ లో వినేనాధుడే కనిపించడం లేదన్నారు. ఒక వేళ ఎవరైనా అడిగితే బెదిరింపులు, కక్ష సాధింపులకు పాలపడుతుందన్నరు.. ఒక వేళ ఎవరైనా అడిగితే బెదిరింపులు, కక్ష సాధింపులు చేస్తూ ఏవిదమైన ముందస్తు నోటీసులు లేకుండా నేరుగా సస్పెండ్లు లేదా బదిలీలు చేస్తున్నారన్నారు. 31.01.2024న నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడినందుకు 01.02.2024న ఎప్పుటి లాగే విధులకు హాజరు అవుతున్న సమయంలో గేటు దగ్గర ఇద్దరు ఉద్యోగులను ఆపేసారన్నారు. యాజమాన్యం చేపడుతున్న ఈ చర్యలపై ఆందోళన చెందిన ఉద్యోగులు తొటి ఉద్యోగలను అన్యాయంగా ఆపివేయడంతో ఆక్షణం నుండి విధులను బహిష్కరించారన్నారు. సంస్థ చైర్మన్ వెంటనే కలుగ జేసుకొని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా యూనియన్తో చర్చించి పరిషష్కారం చేయాలని కోరుతున్నామన్నారు.
2011 నుండి 2020 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన డి.ఎ ను ఉద్యోగులందరికీ చట్టప్రకారం చెల్లించారు, కానీ 2020 అక్టోబరు నుండి నేటి వరకు డి. ఏ లను ఏ ఒక్కరికి చెల్లించలేదన్నారు. బకాయి ఉన్న 7 డి.ఏలను ఎరియర్స్తో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి (2011-2013-2015-2017) 2019లో జరగాల్సిన వేతన ఒప్పందం నేటికి జరగలేదు, వెంటనే వేతన ఒప్పందం చేయాలన్నారు. కక్షసాదింపుల్లో బాగంగా కొంత మంది ఉద్యోగులను బదిలీచేసారన్నారు, వీరికి మిమ్స్ లోనే డ్యూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2సం||రాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. 2019 లో వేతన ఒప్పందానికై ఉద్యోగులు పోరాడిన సందర్భంగా కొంతమంది ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్పెండ్ చేసిన ఇద్దరిని స్పెన్షన్ ఉపసంహరించుకొని బేషరుతుగా విదుల్లోకి తీసుకోవాలన్నారు. డ్యూటీలో భాగంగా జరిగిన చిన్నచిన్న పొరపాట్లకు ఉద్యోగుల నుండి డబ్బులు రికవరీ చేసారు, రికరీచేసిన దబ్బులను తిరిగి ఆ ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై కక్షసాధింపులు, బెదిరింపులు ఆపాలన్నారు. యాజమాన్యం చర్చలు జరిపి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం 19 న జిల్లా వ్యాప్తంగా మిమ్స్ ఉద్యోగులు పోరాటానికి మద్దతు గా రాస్తారోకోలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఇఫ్టు నాయకులు అపలసురి.ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పార్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు వి.లక్ష్మి,ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎస్ డబ్లూఫ్ నాయకులు వి.రాములు, కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.ఆనంద్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు సి హెచ్ వెంకటేష్, డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు హరీష్,బవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె.త్రినాథ్, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్,నాయకులు టివి రమణ, మీమ్స్ ఉద్యోగులు పైడిరాజు,సేతం నాయుడు,బంగారు నాయుడు, ఎం.రవి ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️