అప్పుడప్పుడు

Jan 23,2024 09:56 #jeevana

మిత్రులందరం చెరువు

ఒడ్డున-చూచినాము వలలు

చేపలు పడదామంటే అందరూ

ఊపినారు తలలు..

 

అంతటలోనే అచట

చేరినవి రెండు పెద్ద పులులు

భయపడి పరుగులు పెట్టి

దారిలో చూచినాము శిలలు..

 

శిలల దగ్గర మేము

చూచితిమి సుత్తుల పక్కన ఉలులు

చెక్కి ఉంచిన బొమ్మల వద్ద

పెట్టినారు వెలలు..

 

తినుటకు అచ్చట ఎవరో

ఉంచిరి అరటిపండ్ల గెలలు

శిలలకు దరిలో కనిపించినవి

మంచి నీటి జలలు..

 

మళ్లీ అచటికి చేరినాయి

ఆ రెండు పెద్ద పులులు

భయపడి పరుగులు పెడుతూ ఉంటే

చెదరినాయి కలలు..

 

మళ్లీ కల రాకుండా

నాకు గడిచినాయి నెలలు

అప్పుడప్పుడు వస్తుంటాయి

రాత్రి నిద్రలో కలలు..  – ఎన్‌విఆర్‌ సత్యనారాయణమూర్తి, 94408 94087.

➡️