కొబ్బరినీటిలో పోషకాలెక్కువ…

Mar 28,2024 05:30 #jeevana

వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం కోసం కొబ్బరినీళ్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ నీళ్లు తాగితే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ షుగర్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మం ఇన్ఫెక్షన్‌ కాకుండా కాపాడతాయి. క్యాన్సర్‌ కాకుండా కాపాడటమే కాకుండా, దప్పిక తీరడానికి బాగా సహాయపడతాయి. వీటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. శీతలపానీయాల జోలికి వెళ్లకుండా కొబ్బరినీరు తాగటం వల్ల మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే కొబ్బరినీళ్లు తాగాలని పెద్దలు సూచిస్తుంటారు. తలనొప్పి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ నీళ్లు తాగటం చాలామంచిది. కొబ్బరి నీటిలో తేనె కలుపుకుని తాగటం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిలో విటమిన్‌ాసి ఉంటుంది. ఈ రెంటినీ కలిపి తాగటం వల్ల రోగ నిరోధకశక్తి పెరగటమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. కొబ్బరినీళ్లు, తేనె పానీయం తాగటం వల్ల ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్‌ సమస్యలు, అల్సర్‌, కడుపులో మంట వాటిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగటానికి ఈ పానీయం దోహదపడుతుంది. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

➡️