అంకెలగారడీ

Feb 6,2024 09:31 #amaravati, #Number Juggle, #TDP

అమరావతి : ‘గవర్నరు ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాల మయం. ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి గవర్నరు ద్వారా మరోసారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పోలవరం, రాజధాని అంశాల్లో జరిగిన మోసం, రైతులు, నిరుద్యోగులు, యువతకు చేసిన దగా, దళితులు, బడుగు, బలహీనవర్గాలకు అందించే రాయితీల్లో దగా వంటి కీలకాంశాల ప్రస్తావన లేదు. విద్య, వైద్య రంగ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయాయి. రాష్ట్రంలో దోపిడీ పెరిగి ధరలు పెరిగాయి. అమ్మఒడి పథకం అందుకునే తల్లులు 43.61 లక్షల మంది అయినప్పుడు విద్యార్థులు 83 లక్షలు ఎలా అయ్యారో జగన్‌ చెప్పాలి.ప్రాథమిక పాఠశాలలు మూతపడి లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. కౌలు రైతుల ప్రసావ్తన గవర్నర్‌ ప్రసంగంలో లేదు.’ – టిడిపి ఎమ్మెల్సీలు బిటి నాయుడు, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్‌.

➡️