బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు : భట్టి విక్రమార్క

Nov 26,2023 16:15 #bhatti vikramarka, #press meet

ఖమ్మం : గత పది సంవత్సరాల నుండి బీఆర్‌ఎస్‌ హాయంలో ఒక్క అభివఅద్ధి జరగలేదు.. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని సీఎల్పీ నేత భట్టి మండిపడ్డారు.ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్‌లో కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోట అని అన్నారు. డాక్టర్‌ రాగమయి దయానంద్‌ లు ప్రజా సేవ చేసిన నాయకులని తెలిపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి విచ్చలవిడిగా చేస్తుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం హయాంలో మాత్రమే అభివఅద్ధి జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులందరూ భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు..ప్రభుత్వం మనమే ఏర్పాటు చేస్తున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యలేదని.. కేసీఆర్‌ కి బుద్ది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతుకు ఎకారానికి రూ.15000 ఇస్తాం.. బోనస్‌ గా 500, రైతుకూలీలకు 12000 ఇస్తామన్నారు. అంతేకాకుండా.. ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని తెలిపారు. ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ విద్యార్ధులకు ఇస్తాం.. నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. ఇవే కాక.. 200 యూనిట్లు కరెంట్‌ ఉచితంగా ఇస్తామన్నారు. ఈ మీటింగ్‌ లో తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్‌ నియోజక అభ్యర్థి డాక్టర్‌ రాగమయి దయానంద్‌ లు పాల్గొన్నారు.

➡️