ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య ఒప్పందం కుదరలేదు : వైట్‌హౌస్‌

Nov 20,2023 11:55 #israel hamas war, #White House

 

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్‌ హౌస్‌ స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా కృషి కొనసాగిస్తోందని అధికార ప్రతినిధి ఒకరు శనివారం రాత్రి తెలిపారు. గాజాపై యుద్ధం ఏడవవారంలోకి ప్రవేశించడంతో.. హమాస్‌ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో 5,000 మంది చిన్నారులతో సహా 12,300 మంది మరణించారు. దక్షిణ గాజాపై ఇజ్రాయిల్‌ దాడికి సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది.
గాజాను పాలస్తీనా అథారిటీ పాలించాలి : బైడెన్‌
ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధం తర్వాత వెస్ట్‌బ్యాంక్‌, గాజాను పాలస్తీనా అథారిటీ పరిపాలించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శనివారం వ్యాఖ్యానించారు. యుద్ధం అనంతరం గాజా విషయంలో అమెరికా అభిప్రాయాన్ని బైడెన్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌లోని ఓ ఆర్టికల్‌లో వెల్లడించారు. గాజా ప్రాంతం మొత్తానికి సైనిక రక్షణ బాధ్యతలను తాము చూస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

➡️