పాలకొల్లులో వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలు : ఎమ్మెల్యే నిమ్మల

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో అసంతృప్తిగా నిలిచిపోయిన ఎన్టిఆర్ కళాక్షేత్రంను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలను పాలకొల్లులో నిర్వహిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. 15వ జాతీయ స్థాయి నాటికల పోటీల బహుమతి ప్రదానోత్సవంలో బుదవారం తెల్లవారుజామున ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 10 కోట్ల ఖర్చుతో నిర్మించిన కళాక్షేత్రం పనులు టిడిపి హయాంలో 70 శాతం పూర్తి అయ్యాయని గత 5 సంవత్సరాలలో రూపాయి పని జరగలేదని చెప్పారు. పని జరగక ఉన్న సరంజామా పాడైపోయి సిమెంట్ బస్తాలు ముద్ద కట్టి నష్టం చేకూరిందని అయినా టిడిపి, జనసేన అధికారులకు వస్తే ఏడాది చివరకు దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకా బహుమతి ప్రధానోత్సవంలో సినీ నిర్మాత బన్నీవాసు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు విటాకుల రమణ, కెవి కృష్ణ వర్మ, మేడికొండ శ్రీనివాస్ ,ఉన్నమట్ల కబర్ధి, కామిశెట్టి అయ్యప్ప నాయుడు, మానాపురం సత్యనారాయణ, కొణిజేటి గుప్త తదితరులు పాల్గొన్నారు.

  • ఉత్తమ ప్రదర్శన “రాత”

పాలకొల్లులో 3 రోజుల పాటు జరిగిన 15వ జాతీయస్థాయి నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా వెలగలేరు థియేటర్స్ ఆర్ట్స్- రాత ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయ పార్టీ, గుంటూరు – ఇంద్ర ప్రస్థం ఎంపికైంది. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం, జ్యూరి ప్రదర్శనగా అరవింద ఆర్ట్, వాడేపల్లి – మనస్విని ఎంపికైంది. ఉత్తమ రచనగా ఎనిమి – పి.ఎన్.ఎం కవి,
ఉత్తమ దర్శకత్వం రవీంద్రరెడ్డి, ఉత్తమ నటుడుగా రాతలో గోవర్ధన్ పాత్రధారి శ్రీనివాసరావు, ఉత్తమ నటిగా రాత నాటికలో స్వప్నిక పాత్రధారిణి సురభి వాగ్ధేటి, ఉత్తమ ప్రతినాయకుడుగా రాత నాటికల అజయ్ పాత్రధారి పవన్ కళ్యాణి ఎంపికైంది. ఉత్తమ హాస్యనటుడుగా ఎనిమీ నాటికలో ఈ సుఖ పాత్రధారి – వి.సురేష్ విముక్తి చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు.

➡️