బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ :    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంటులో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో మొరార్జీ దేశారు రికార్డును సమం చేశారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌’ తమ మంత్రంగా పేర్కొన్నారు.

పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నతస్థాయికి చేరుకుంది. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశాయి. ఆత్మ నిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతివ్యక్తి భాగస్వామ్యం అయ్యారు. గత పదేళ్లలో అందరికి ఇళ్ల నిర్మాణానికి కృషి చేశామని అన్నారు. అవినీతిని గణనీయంగా తగ్గించామని చెప్పారు.

” కొత్త సంస్కరణలతో పారిశ్రామికవేత్తలు పెరిగారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజానాలు కల్పించాం. పిఎం విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తువారిని ఆదుకున్నాం. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందిస్తున్నాం. 34 లక్షల పేదలకు నేరుగా నగదు బదిలీ చేశాం. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందించాం. 25 లక్షల మందిని పేదరికం నుండి బయటపడేసాం. రూ.34 లక్షల కోట్లు డిబిటి ద్వారా ప్రజలకు అందించాం. ఇంటింటికీ తాగునీరు, కరెంట్‌, ఉపాధి కల్పనతో సమ్మిళిత అభివృద్ధి సాధించాం. అన్నదాతల కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లుగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తిరిగి అధికారంలోకి వస్తాం. మోడీ పాలనలో పారదర్శకతను పెంచాం. దేశంలో అవినీతి, కుటంబ పాలనను అంతం చేశాం అని అన్నారు.

 

30 కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలను అందించాం.

కొటి గృహాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ఆశావర్కర్లు అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది.

స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1,4 కోట్ల మంది యువతకుశిక్షణ. పౌర విమానరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం. 517 ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు.

యువత కోసం లక్ష కోట్లతో దీర్ఘకాలిక కార్పస్‌ ఫండ్‌.

వందే భారత్‌, నమో భారత్‌తో రైల్వే వ్యవస్థ బలోపేతం. 41వేల రైల్వే కోచ్‌లను వందేభారత్‌ కింద మార్పు. మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు. ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తాం.

9-14 మధ్య బాలికలకు గర్భాశయ నివారణకు క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌. మరిన్ని మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి తీసుకువస్తాం.

యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ దేశానికి గేమ్‌ ఛేంజర్‌గా మారబోతోంది.

జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ మా నినాదం.

మత్స్య రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రెండింతలు పెరిగాయి.

కొత్త టాక్స్‌ విధానంలో రూ.  7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. ఆదాయపు పన్ను చెల్లింపులను సులభతరం చేస్తాం.

కార్పోరేట్‌ ట్యాక్స్‌ 3ం శాతం నుండి 22 శాతానికి తగ్గింపు.  కొత్త పన్ను శ్లాబ్‌లు యథాతథం. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు శాతం పెరిగాయి. మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యుడికి ఊరట. ఆదాయపుపన్ను చెల్లింపులు సులభతరం.

 

➡️