మహారాష్ట్రలో ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లు మార్పు?

Mar 14,2024 08:13 #Indian Railways, #Maharashtra

న్యూఢిల్లీ : ముంబయిలోని ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే అన్నారు. ముంబై సెంట్రల్‌ స్టేషన్‌ పేరును నానా జగన్నాథ్‌ శంకర్‌షేత్‌ స్టేషన్‌గా, కర్రీ రోడ్‌కి లాల్‌బాగ్‌గా, శాండ్‌హర్స్ట్‌ రోడ్‌కి డోంగ్రీగా, మెరైన్‌లైన్స్‌ను ముంబదేవిగా, చర్ని రోడ్‌కి గిర్‌గావ్‌గా, కాటన్‌ గ్రీన్‌ పేరు కాలాచౌకీగా, డాక్‌యార్డ్‌ను మజ్‌గావ్‌గాను, కింగ్స్‌ సర్కిల్‌కు తీర్థంకర్‌ పార్శ్వనాథ్‌ అని పేరు మార్చనున్నట్లు చెప్పారు. ‘ రైల్వే స్టేషన్ల పేర్లను మార్చాలని ముంబైకర్ల నుంచి డిమాండ్‌ ఉంది. ఈ భావాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాను. ఈ డిమాండ్‌కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినం దుకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకి ధన్యవాదాలు” అని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని షెవాలే తెలిపారు.

➡️