నాగార్జున ‘నా సామిరంగ’

Jan 22,2024 10:39 #movie

నాగార్జున ప్రతి సంక్రాంతికి ఓ సినిమా తప్పక విడుదల చేసే పనిలో ఉంటున్నారు. ఈ ఏడాది కూడా పల్లెటూరి నేపథ్యంలో ‘నా సామిరంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. వాస్తవానికి ఇది ‘పొరింజు మరియమ్‌’ అనే మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌. యాక్షన్‌, కామెడీ, పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పాత సినిమా కథలా ఉన్నా లవ్‌, యాక్షన్‌, ఎమోషన్‌ అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు విజరు బిన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌ కనిపించి సందడి చేశారు.

➡️