గెలుపుతో ముగించాలి : నేడు ఆస్ట్రేలియాతో ఐదో, చివరి టి20

Dec 3,2023 10:47 #Sports
  • రాత్రి 7.00గం||లకు

బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టి20లో నెగ్గిన టీమిండియా.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆసీస్‌పై 4వ టి20లో నెగ్గి ఈ ఫార్మాట్‌లో 136వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టి20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన పాకిస్తా న్‌(135)ను అధిగమించింది. ఇక నాల్గో టి20లో 20 పరుగుల తేడాతో నెగ్గిన భారత్‌ 3-1తో సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకోగా.. ఐదో, చివరి టి20కి బెంగళూరులోని చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. నాల్గో టి20లో ఆసీస్‌పై రింకూ సింగ్‌(46) బ్యాట్‌ ఝుళిపించగా.. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోరు టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు.

వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ స్థానంలో జితేశ్‌ శర్మ చోటు దక్కించుకొని సత్తా చాటాడు. దీంతో అతనికి ఐదో టి20లోనూ చోటు దక్కడం ఖాయం. మరోవైపు పేసర్లు ఆర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిధ్‌ కృష్ణ స్థానాల్లో చోటు దక్కించుకొన్న ముఖేష్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌ రాణించారు. దీంతో ఐదో టి20లో భారత్‌ పెద్దగా మార్పుల్లే కుండా బరిలోకి దిగవచ్చు. ఇక ఆస్ట్రేలియా జట్టులో సీనియర్ల కొరత వేధిస్తోంది. మూడో టి20 ముగిసాక స్మిత్‌, స్టొయినీస్‌, జంపా, మ్యాక్స్‌వెల్‌ తిరుగు పయనం కావడంతో ఆ జట్టు మరి కోలుకోలేకపోయింది.

జట్లు(అంచనా)..

భారత్‌ : జైస్వాల్‌, సూర్యకుమార్‌(కెప్టెన్‌), గైక్వాడ్‌, శ్రేయస్‌, జితేశ్‌ శర్మ(వికెట్‌ కీపర్‌), రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోరు, దీపక్‌ చాహర్‌, ఆవేశ్‌ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌.ఆస్ట్రేలియా: మాధ్యూ వేడ్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఫిలిప్‌, హెడ్‌, మెక్‌ డెర్మాట్‌, హార్డి, టిమ్‌ డేవిడ్‌, మాధ్యూ షార్ట్‌, డ్వార్ష్‌స్‌, రిచర్డుసన్‌, ఎల్లిస్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, సాంఘా.

టి20ల్లో వివిధ జట్లగెలుపు వివరాలు..

1. ఇండియా     :   136(213 ఇన్నింగ్స్‌)

2. పాకిస్తాన్‌      :  135(226)

3. న్యూజిలాండ్‌ :  102(200)

4. ఆస్ట్రేలియా     :  95(181)

5. దక్షిణాఫ్రికా    :  95(171)

6. ఇంగ్లండ్‌        :  92(177)

7. శ్రీలంక           :   79(180)

8. వెస్టిండీస్‌       : 76(184)

9. ఆఫ్ఘనిస్తాన్‌     : 74(118)

10. ఐర్లాండ్‌       : 64(154)

➡️