ఎమ్మెల్యే నిమ్మలను కలిసిన సినీ నటుడు నారాయణ మూర్తి

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం సిని నటుడు, దర్శకుడు, ఆర్‌ నారాయణమూర్తి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు మీదేనంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తిని ఎమ్మెల్యే సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురు రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించారు.

➡️