ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ పరీక్ష

Feb 18,2024 00:03

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్, జెవివి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం మోడల్ టెస్ట్ శనివారం నిర్వహించారు. స్థానిక విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, టీఎం రావు ఉన్నత పాఠశాల్లో పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్ మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకుగాను ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసి, సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఇలాంటి పరీక్షలు దోహదపడతాయని అన్నారు. ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్‌కు జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన పరీక్షలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వచ్చిన మార్కుల కనుగుణంగా విద్యార్థులను ప్రకటించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ కరస్పాండెంట్ ఎంపీ వెంకట్రావు, టిఎం రావు ఉన్నత పాఠశాల హెచ్ఎం సి రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️