సమస్యలు పరిష్కారం చేయకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు వీధిలో తీరగలేరు

Dec 23,2023 16:30 #Anganwadi strike, #Kurnool
  •  సిపిఎం నేతల హెచ్చరిక

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ : అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే మంత్రులను ఎమ్మెల్యేలను గ్రామాల్లో పట్టణాల్లో వారి పర్యటనలను అడ్డుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయి, సిపిఎం నగర కార్యదర్శిలు రాజశేఖర్‌ రాముడు హెచ్చరించారు. డిసెంబర్‌ 12వ తేదీ నుండి అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని,రిటైర్మెంట్‌ బెన్ఫిట్‌ ఇవ్వాలని, తమను 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని కోరుతూ ధర్నా చౌకలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల పోరాటానికి వారు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి అంగన్వాడీ కార్మికులకు తాను అధికారంలోకొస్తే అందరికంటే మెరుగైన వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ గంగలో తొక్కాడని వారు విమర్శించారు. అంగన్వాడీ పోరాటాన్ని విచ్చినం చేయడం కోసం అనేక రకాల కుట్టలు కతజ్ఞతలు చేయడం దుర్మార్గమైన చర్య అని వారికి పూర్తిగా సచివాలయ ఉద్యోగులను అంగన్వాడీ సెంటర్లను తెరవడానికి పంపించడం దారుణమని, ఉద్యోగుల మధ్య తగాదా పెంచే కార్యక్రమం తప్ప మరొకటి కాదనివారు తెలిపారు. 90% అంగన్వాడి సెంటర్లు నడుస్తున్నాయని అబద్ధపు ప్రచారాన్ని కల్పించే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని వాళ్ళు హెచ్చరించారు. ఐదు సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేలకు ఎంపీలకు లక్షల రూపాయలు జీతాలు ఎందుకని వారు ప్రశ్నించారు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల సేవలు అంగన్వాడీ కార్యకర్త ద్వారా ప్రభుత్వాలు చేయించుకుని వారికి నామమాత వేతనం ఇవ్వడం సరైన పద్ధతి కాదని కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కార్మికులకు పదవీ విరమణ వయస్సు వేస్తున్నట్లు బ్రమలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని అంగన్వాడీ కార్మికులు ఇటువంటి భ్రమలకు లోను కాకుండా ఉండాలని వారు తెలిపారు. అంగన్వాడీ కార్మికులు ప్రభుత్వానికి చేయించుకున్న సందర్భంలో ప్రభుత్వం తగిన వేతనాన్ని ఇచ్చి ప్రోత్సహించాలి తప్ప వారిని వేధించ కార్యక్రమం చేపట్టడం సరైనది కాదని వారు తెలిపారు. ఇప్పటికే అనేక హాస్టల్లో కనీస వేతనం 18000 అమలు చేస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తాను ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని మాట తప్పను మడమ తిప్పను అని మాటల్లో మాత్రమే కనబడుతుందని చేతల్లో మాత్రం ఏ మాత్రం చేయడం లేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేశ్యజాలకు మానుకుని అంగన్వాడీ చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని అలా చేయకుండా తస్కారం చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సి వస్తుందని అలా ఉద్యమిస్తే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతితులు వీధుల్లో తిరగలేరని వారు హెచ్చరించారు.

➡️